లిటిల్ ఫ్లవర్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 13(జనం సాక్షి)
వరంగల్ నగరం రంగ సాయి పేట లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 100 జాతీయ పతాకంతో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు రంగశాయిపేట, శంభునిపేట, గవిచర్ల క్రాస్ రోడ్ కూడలల్లో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శేర్ల.అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావులు త్యాగఫలం వలన ఈరోజు భారతదేశ స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నది. ప్రజలలో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదిక అమృత్ మహోత్సవ్ మరియు హర్ ఘర్ తిరంగా అనే అనే కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు. మన దేశ ఖ్యాతిని ప్రతిబింబించేది మన జాతీయ జెండా మనకు గర్వకారణం అని అనిల్ కుమార్ అన్నారు. మన జాతీయ జెండా భావితరాలకు మన దేశ కీర్తిని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి. ప్రదీప్ రావు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ,కొల్లూరి.యోగానంద్, 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన, పూర్ణ ఆర్ వై ఎఫ్ సభ్యులు,పాఠశాల కరెస్పాండంట్ శేర్ల. రజని, ఉపాధ్యాయులు యాకుబ్ పాషా, సాలెహ, పూర్ణిమ, రజిత, కృష్ణవేణి, తులసి, సాయికృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.