లైన్స్ క్లబ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో షుగర్ నిర్ధారణ పరీక్షలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనం సాక్షి). లైన్స్ క్లబ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో శుక్రవారం ఉచిత షుగర్ నివారణ పరీక్షలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ ఆకునూరి విజయనిర్మల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రజల్లో షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు గుగ్గిళ్ళ జగన్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలు అవగాహన కార్యక్రమాలు షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పి డి సి ఎస్. లయన్ దుర్గాప్రసాద్ కోశాధికారి భాను ప్రసాద్, పి డి జి అనంతుల శివప్రసాద్, పి జెడ్ సి భూడిమే శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.