లోకల్ లో ఉండి సేవలు చేస్తా ప్రజలు ఆశీర్వదించండి
లోకల్ లో ఉండి సేవలు చేస్తా ప్రజలు ఆశీర్వదించండి
జహీరాబాద్ అక్టోబర్ 12 (జనం సాక్షి)
లోకల్ లో ఉండి ప్రజలకు సేవ చేస్తానని అందరి సహకారంతో జహీరాబాద్ నియోజక వర్గం అని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను అని బిజేపీ పట్టణ జనరల్ సెక్రటరీ మోహన్ మునగాల అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడాతూ .కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వం అందజేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.అధిష్టానం నా పేరు ను పరిశీలిస్తుంది అని తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అని అన్నారు. మీ ఆశీర్వాదం తో తప్పక గెలుస్తాను అన్నారు.గతంలో కరోనా వ్యాధి కారణంగా లాక్ డౌన్ లో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అందుబాటులో ఉండి సేవలు చేస్తానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.