లోకేశ్ వాదనలో పసలేదు: సిపిఎం
కడప,జూలై6(జనం సాక్షి): జేపీకి కర్ణాటకలో ట్రెయిలర్ చూపించాం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా మొత్తం చూపిస్తామనిచెబుతున్న మంత్రి లోకేశ్ ఆరు నెలల్లో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని చేస్తున్న డిమాండ్ ఎలా సాధ్యమో చెప్పడం లేదని సిపిఎం కార్యదర్వివర్గ సభ్యులు సిహెచ్. చంద్రశేఖర్ అన్నారు. కేవలం కీర్తి కండూతి తప్ప టిడిపి నేతలకు కడప ఉక్కు ఫ్యాక్టరీపై చిత్తశుద్ది లేదన్నారు. విభజన చట్టంలో ఉందని మాట్లాడుతున్న లోకేశ్ ఈ నాలుగేళ్లూ దాని ఊసెందుకు ఎత్తలేదో చెప్పాలని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నా సమధానం ఇవ్వడం లేదన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు తామే పోరాడుతున్నామని చెపుతూ అదే సమస్యపై ప్రశాంతంగా బంద్ నిర్వహించిన ప్రతిపక్షాల విూద విరుచుకు పడుతున్నారు. కేంద్రానికి ఊడిగం చేసినా, కేంద్రం విూద ఉద్యమం చేసినా మేమే చెయ్యాలి ఇంకెవరూ చెయ్య కూడదన్నది బాబు, లోకేశ్ల విధనంగా ఉందన్నారు. అందుకే వారు ఉమ్మడి పోరాటంలో కలసి రావడం లేదన్నారు. ఇటీవల సీఎం రమేష్, బీటెక్ రవి నిరాహార దీక్ష ఫలితంగా కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చేసిందన్న లెవల్లో ప్రచారం చేఉకోవడం సిగ్గుచేటని అన్నారు.