ల్యాండ్ పూలంగి కింద భూమి తీసుకోవద్దు

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 10:: వందల సంవత్సరాలుగా తమ తాత ల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నామని మాకు ఆ భూమి జీవనాధారానికి దిక్కు అని అలాంటి భూమిని ల్యాండ్ పోలింగ్ కింద తీసుకోవద్దంటూ తూప్రాన్ ఆర్డీవో కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులో గల 14 సర్వే నెంబర్లు గల 316 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ వారు ల్యాండ్ పోలింగ్ కింద తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేశారని వారు తెలిపారు తాము తమ తాతలు తండ్రుల నుండి తాము తమ పిల్లలు కూడా అదే భూమిని సాగు చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ జీవిస్తున్నామని భూములు తీసుకుంటే తాము దిక్కులేని వారం అవుతామని తమకు ఎలాంటి ఉపాధ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ భూమిలో రామప్ప గుట్ట దేవాలయం మల్లన్న గుట్ట దేవాలయాలకు భూమి వదలాలని కాస్తు చేస్తున్న భూములను తీసుకోవద్దని కోపరేటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయంలో ఉన్న సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇస్లాంపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు
Attachments area