వంద పడకల ఆసుపత్రిలో జి ఎం ఆర్ ఎం ట్రస్ట్ నిత్య అన్నదానం
కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్
భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 17 (జనం సాక్షి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని వంద పడకల ఆసుపత్రిలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి , టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిలో రోగుల బంధువులకు ప్రతిరోజు నిత్య అన్నదానం కార్యక్రమం చేపట్టారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్ , జయశంకర్ భూపాలపల్లి రైతుబంధు సమితి కోఆర్డినేటర్ హింగే మహేందర్ పాల్గొని సుమారు 150 మంది రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బుర్ర రమేష్ మరియు హింగే మహేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి శాసనసభ్యులు పేదల పెన్నిధి విద్యా వైద్య రంగాలలో భూపాలపల్లిని అగ్రస్థానంలో ఉంచుతున్న స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు, యువతి, యువకులకు నిరుద్యోగులకు, క్రీడాకారులకు , కళాశాలలకు అనేక అక్రమాలు చేపడుతూ చేయూతనందిస్తున్నారని తెలిపారు.
ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవర ముత్తు,జి ప్రేమ్, సాగర్,జయంత్, నర్సయ్య పాల్గొన్నారు