వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు
వరంగల్: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమరభేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని ప్రకటించారు. ఇకపై చర్చలు ఉండవని.. మానుకోట తరహా పోరాటాలకు రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. తెదేపా అధినేత వందసార్లు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కంటే.. ఒకసారి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తే చాలని అన్నారు. నీలం తుపాను నష్టం అంచనాల్లోనూ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు.