వజ్రోత్సవ వేడుకలకు పాలకుర్తి ముస్తాబు..

 

పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
ఈనెల 16న జరిగే రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలకు పాలకుర్తి ముస్తాబవుతుంది. మండల కేంద్రంలో గల తహసిల్దార్,ఎంపీడీవో కార్యాలయాల సమీపంలో గల మైదానాన్ని వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. మంగళవారం ఎంపీపీ నల్ల నాగిరెడ్డి తో కలిసి అధికారులు, టిఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను నియోజకవర్గ స్థాయిల్లో 15 వేల మందితో నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 16,17,18 తేదీల్లో వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. 16న పాలకుర్తిలో జరిగే నియోజకవర్గస్థాయి రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. 16న జరిగే వజ్రోత్సవ వేడుకల ను జయప్రదం చేసేందుకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్, ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్, సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలు నాయక్, ఇరిగేషన్ డి ఈ శ్రీకాంత్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ ఖాన్, తొర్రూర్ సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, ఇరిగేషన్ ఏఈ గుగులోతు గోపాల్ నాయక్, టిఆర్ఎస్ మండల సంయుక్త కార్యదర్శి దొంతమల్ల గణేష్, ఉపసర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గజ్జి సంతోష్, దొంత మల్ల గణేష్ టిఆర్ఎస్ పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కడుదుల కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.