వజ్రోత్సవ స్ఫూర్తి నింపేలా భారీ జాతీయ జెండా ఊరేగింపు

మాహాదేవపూర్ ఆగస్టు 13 ( జనంసాక్షి )
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు.వజ్రోత్సవ ద్విసప్తాహం సంబురాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారత్ వజ్రోత్సవ స్ఫూర్తి నింపేలా 75 మీటర్ల భారీ జాతీయ జెండా ఊరేగింపు నిర్వహించడం జరిగింది.దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్ర్య సమర యోధుల వేశధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జాతీయ జెండా సామూహిక ప్రదర్శనతో,విద్యార్థుల కవాతు తో మహాదేవపూర్ గ్రామ పురవీధులు త్రివర్ణ శోభితమై..ప్రజల్లో నూతన ఉత్తేజం,ఆనందాన్ని నింపింది.ప్రజాప్రతినిధులు,అధికారులు,ఉపాధ్యాయులు,నాయకులు,యువకులు జాతీయ జెండా లు చేతపట్టి,బోలో స్వాతంత్ర్య భారత్ కీ జై అని నినదించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగా దేశంలో బ్రిటిష్ వారి సుదీర్ఘమైన పాలనకు స్వస్తిపలికి..స్వాతంత్య్ర జెండా ఎగురవేయడం జరిగిందని, అన్నారు.దేశభక్తి పై అవగాహన పెంచుకోవాలని,దేశభక్తిభావం పెంపొందించుకొని సరియైన మార్గంలో స్వేచ్ఛగా జీవించాలని డిఎస్పీ బోనాల కిషన్ అన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు .ఎంపీపీ బి రాణి బాయి,జడ్పీటీసీ గుడాల అరుణ,సిఐ కిరణ్,ఎస్ఐ రాజ్ కుమార్,ఎంపీడీఓ శంకర్ నాయక్,ఎంపిఓ ప్రసాద్,గ్రామ కార్యదర్శి సమ్మయ్య,ఉపాధిహామీ ఏపీఓ రమేష్,ఫారెస్ట్ అధికారులు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బొల్లం సతీష్,అశోక్,తిరుపతిరెడ్డి,నాయకులు,ఉపాధ్యాయులు,యువకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.