వరంగల్లో నో హెల్మెట్- నో పెట్రోల్ ఫ్లెక్సీల ఏర్పాటు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 11(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ బంక్లలో నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ గురువారం తెలిపారు. వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని పెట్రోల్ బంక్ లలో ఈ నెల 15వ తారీఖు నుండి ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయారు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ యస్ఐ లు రాజబాబు,డేవిడ్,రామారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.