వరంగల్‌కు గ్రేటర్ హోదా
-తెలంగాణ సర్కారు జీవో జారీ
వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
సచివాలయంలో బుధవారం మున్సిపల్ కార్యదర్శి ఎంజీ.గోపాల్, మున్సిపల్ శాఖ కమీషనర్ బి.జనార్దన్ రెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలతో కూడిన వరంగల్ నగరం తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న
ప్రాంతమని ముఖ్యమంత్రి అన్నారు. పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో రాష్ట్ర రాజధానికి ధీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దడమే
ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కొద్ది కాలం క్రితమే 42గ్రామ పంచాయతీలు కూడా కలవడంతో
నగరం బాగా విస్తరించిందని, నగర జనాభా దాదాపు 10 లక్షలకు చేరువయ్యిందని చెప్పారు. చారిత్రకంగా, పర్యాటక పరంగా
వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.