వరంగల్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తాం

3

– ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాం

– ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది

– మీట్‌ ది ప్రెస్‌లో హరీశ్‌ రావు

వరంగల్‌,మార్చి1(జనంసాక్షి):  వచ్చే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.వరంగల్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. వచ్చే మూడేళ్ళలో వరంగల్‌కు రూ.900 కోట్లు కేటాయించి అభివృద్ధి బాటలో నడిపిస్తామని హరీష్‌ తెలిపారు. వరంగల్‌ ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉంది మిగతా వారెవ్వరికీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్‌ అని హరీష్‌రావు కితాబిచ్చారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు అనంతరం విూట్‌ ది ప్రెస్‌లో మాట్లాడారు.  వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కారు జోరుగా ప్రచారం నిర్వహిస్తోందని, వెళ్లిన ప్రతిచోట టీఆర్‌ఎస్‌ శ్రేణులను జనం గుండెలకు హత్తుకుంటున్నారని వెల్లడించారు. గెలుపు విూదేనని సంకేతాలను ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలకు బుద్ది చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో, నారాయణఖేడ్‌లో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. అవే ఫలితాలు వరంగల్‌లో కూడా వస్తాయని ఆశిస్తున్నానన్నారు. హైదరబాద్‌లో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఐదు మంది కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో చెల్లని బీజేపీ వరంగల్‌లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే వరంగల్‌ నగరాభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీకి తెలంగాణాలో మనుగడ లేదని, కాంగ్రెస్‌ దయనీయమైన స్థితిలో ఉందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.  హైదరాబాద్‌లో చెల్లని కిషన్‌రెడ్డి వరంగల్‌లో ఎలా చెల్లుతారని ఆయన విమర్శించారు. వరంగల్‌ ప్రజలు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఇస్తారని హరీష్‌ జోస్యం చెప్పారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు బీజేపీకి సంబంధించిన అంశమని హరీష్‌ చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రతిపక్షాల నుండి పోటీ లేదు..రెబల్‌ అభ్యర్థులే మాకు పోటీ అని విూట్‌ ది ప్రెస్‌లో హరీష్‌రావు తెలిపారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు దూసుకుపోతున్నాయని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓటు వేయాలో, ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదో తాము చెబుతూ వస్తున్నామన్నారు. 60 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్‌ పాలన, 20 నెలల టీఆర్‌ఎస్‌ పాలనను చూసి బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. వరంగల్‌ ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు. వరంగల్‌కు వన్నె తెచ్చింది కాకతీయులు, వారి పూర్వ వైభవాన్ని నిలబెట్టింది టీఆర్‌ఎస్‌ అని అందుకే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల పునరుద్దరణ పనులకు కాకతీయుల పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్‌కు రెండు యూనివర్సిటీలను కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. శిల్పారామం, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను కేటాయించామని తెలిపారు. ఐటీ విస్తరణ కోసం ఇటీవలే మంత్రి కేటీఆర్‌ పలు కార్యక్రమాలు చేశారని అన్నారు. వరంగల్‌ పేద ప్రజలపై భారం పడకుండా రూ.900 కోట్లతో 15 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కేటాయించామన్నారు. జర్నలిస్టులకు కూడా హెల్త్‌కార్డులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఇస్తామన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది వరంగల్‌ ప్రజలు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌, నారాయణఖేడ్‌ ఎన్నికల  ఫలితాలనే ఇక్కడ కూడా ప్రతిపక్షాలు చవిచూస్తాయని తెలిపారు. క్లీన్‌ స్వీప్‌ ఫలితాలు వరంగల్‌లో కూడా వస్తాయని భావిస్తున్నామన్నారు. పనిచేసే ముఖ్యమంత్రిని దీవించి వరంగల్‌ అభివృధ్దికి సహకరించాలని కోరారు. బండికి ఎద్దు, దున్నపోతును కట్టి నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే వరంగల్‌ అభివృద్ధి సాధ్యమన్నారు.

టిఆర్‌ఎస్‌ గెలుపుతోనే గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి

తెలుగుదేశం, కాంగ్రెస్‌ హయాంలో పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో తొలగించేందుకు వరంగల్‌ ప్రజలు టిఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇచ్చిన తీర్పును ఇక్కడా ఇవ్వాలన్నారు. వరంగల్‌ అభివృద్ది జరగాలంటే టిఆర్‌ఎస్‌కు అవకాశం ఉండాలన్నారు. లంచాలు లేకుండా గ్రేటర్‌ వరంగల్‌ కార్యాలయంలో పనులు జరిగేలా చూస్తామని ఆయన హావిూ ఇచ్చారు. పారదర్శక, ఖచ్చితత్వంతో కూడిన పాలనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో భాగంగా హన్మకొండలోని పలు డివిజన్లలో మంత్రి మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ మహానగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన అవగాహన, అభివృద్ధి నమూనాతో ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ కారు దూసుకు పోవాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తమకెంతో బలం చేకూర్చిందన్న మంత్రి ఇప్పుడు వరగంగల్‌ అభివృద్ధికి కూడా ప్రజలు ముందుకు రావాలన్నారు.  కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  మంత్రి హరీష్‌రావు వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌లో రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. వరంగల్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ గెలవాలని ఓటర్లకు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బిడ్డలను కార్పొరేటర్లగా గెలిపించి గ్రేటర్‌ మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ముఖ్యంగా వరంగల్‌ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్‌ బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి పనులు చేయనున్నారని తెలిపారు. విూ సమస్యలు తీర్చి నగర అభివృద్ధి చెందాలంటే తెరాస కార్పొరేటర్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో ఉండి నగరానికి ఏంచేయలేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనే ఐదు సీట్లు గెలుచుకోలేని భాజపాకు వరంగల్‌లో గెలిచే ఓట్లులేవన్నారు సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేసతెరాస గెలిస్తేనే నిధులు రావడంతో నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. హరీష్‌రావు వెంట ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  కాగా వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం  జోరు పెంచాయి. మంత్రులు అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఓ వైపు మంత్రి హరీష్‌ రావు,  మరోవైపు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రచారంలో దూసుకుని పోతున్నారు.  వరంగల్‌ మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి  కృషి చేస్తున్నారు. మంగళవారం  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 43, 44, 58 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు 66 ఏళ్లలో చేయని అభివృద్ధిని తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 20 నెలల్లోనే చేసి చూపించిందని తెలిపారు.  గతంలో ఎన్నడూలేని విధంగా వరంగల్‌ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. 20 నెలల్లోనే దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలను ప్రజలు వరుసగా ఓడించినా విపక్ష పార్టీల తీరు మారడంలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు తమపై చేసే విమర్శలను వరంగల్‌ ప్రజలు విశ్వసించరని అన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ చేయని విదంగా వరంగల్‌ అభివృద్దికి సిఎం నడుం బిగించారని అన్నారు. ఇది గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు.