వరంగల్ జిల్లాలో పదో రోజు పాదయాత్ర ప్రారంభం
వరంగల్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా…. మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లాలో పదో రోజుకు చేరింది. ఆకేరువాగు ప్రాంతం నుంచి నేటి యాత్రను చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు వెంట భారీగా అభిమానులు, కార్యకర్తలు కదిలారు.