వరంగల్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్-ఎమ్మెల్యే వినయ్
వరంగల్,ఆగస్టు28 : వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఇండోర్ స్టేడియంలో త్వరలో సింథటిక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు వరంగల్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పలువురికి చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని చెప్పారు.