వరంగల్ జిల్లా కు అదనపు అక్రిడిటేషన్ లు మంజూరు చేయండి….
కలెక్టర్ ను కోరిన టీయూడబ్ల్యూజేే, ప్రతినిధి బృందం..
ఫోటో రైటప్: కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ప్రతినిధి బృందం..
వరంగల్ బ్యూరో ఆగస్టు 29 (జనం సాక్షి)
కొత్త గా జిల్లా కేంద్రం గా ఏర్పాటైన వరంగల్ జిల్లా ను ప్రత్యేక కేటగిరీలో గుర్తించి పాత్రికేయులకు అదనంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజేే వరంగల్ జిల్లా శాఖ కోరింది. ఈమేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మెండు రవీందర్ నాయకత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టర్ గోపి ని కలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా లో వరంగల్ నగరం ఓ నియోజకవర్గం గా మాత్రమే ఉండేదని ప్రస్తుతం కొత్తగా జిల్లా కేంద్రం అయినందున మీడియా విస్తృతి పెరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ కలెక్టరు కార్యాలయం తో పాటు, జిల్లా కార్యాలయాలు జంట నగరాల్లో విస్తరించి ఉన్నాయని తెలిపారు. దీనికి తోడు వరంగల్ జిల్లా లోని , ఎనుమాముల మార్కెట్, కాళోజి హెల్త్ యూనివర్సిటీ, యంజీయం, మున్సిపల్ కార్పోరేషన్, కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మూమునూరు ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, మీడియా కు నిత్యం వార్త కేంద్రాలుగా మారాయన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో విలేకరులు విధినిర్వహణలో భాగస్వాములవుతున్నారని టీయూడబ్ల్యూజేే నాయకులు కలెక్టర్ కు తెలిపారు. పనిచేస్తున్న పాత్రికేయులందరికి నిబంధనలన ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం లేదు. కొత్త జిల్లా ను ప్రత్యేక కేటగిరీలో గుర్తించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న విలేకరుల కు అదనపు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రతినిధి బృందం కలెక్టర్ ను కోరింది. అందుకు అయన సానుకూలంగా స్పందించారు.