వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ర్యాలీ..
వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 13(జనం సాక్షి)
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకోని నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నుండి జె.ఎన్.ఎస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ , ఛీప్ విప్ వినయ్ భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, అదనపు డిసిపిలు పుష్పా రెడ్డి, సంజీవ్ సురేష్ తో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది జాతీయ జెండాను చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు కాజీపేట్ , హనుమకొండ ఏసిపిలు శ్రీనివాస్, కిరణ్ కుమార్ ల అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.