వరంగల్ లో జర్నలిస్టుల బైక్ ర్యాలీ..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 11(జనం సాక్షి)
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని గురువారం వరంగల్ నగరంలో వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత జాతీయ పతాకలతో జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ ని వరంగల్ ఏ సి పి గిరి కుమార్ కలకోట ప్రారంభించారు. అంతకుముందు వెంకటరామ జంక్షన్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఏసిపి పూలమాల వేశారు .ఈ సందర్భంగా ఏసీపీ గిరి కలకోట మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని దేశాభిమానాన్ని స్పురింపజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు వెంకట్రామ జంక్షన్ నుండి పోచం మైదాన్ మీదుగా మండి బజార్, చౌరస్తా, పోస్ట్ ఆఫీస్, అటునుంచి ఫోర్ట్ రోడ్, రంగ సాయి పేట వరకు కొనసాగింది. భారత్ మాతాకీ జై .. మేరా భారత్ మహాన్ అంటూ జర్నలిస్టులు నినాదాలు చేశారు. రంగ సాయి పేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జె. విజయ్ కుమార్, కార్యదర్శి ఎం .రాజేంద్రప్రసాద్, కోశాధికారి ఎం వెంకన్న ,కార్యవర్గం తో పాటు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు