వరదలకు నిండా మునిగిన మంథని ఫర్టిలైజర్ షాప్
యజమానులు జనం సాక్షి, : పెద్దపల్లి జిల్లా మంథని ఎరువుల దుకాణాల యజమానులు భారీ వర్షాలు, వరదలతో నిండా మునిగారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద ముంచెత్తడంతో మంథని పట్టణంలోని ఎరువుల దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. దుకాణాల్లోని ఎరువుల బస్తాలు, పురుగుమందులు వరద నీటిలో తడిసి ముద్దయిపోయాయి. దీంతో ఎరువుల దుకాణ యజమానులు ఒక్కొక్కరు లక్షల రూపాయల్లో నష్టపోయారు. కాగా శుక్రవారం మంథని ఫర్టిలైజర్ షాప్ యజమానులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని లేని యెడల తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు