వరద నష్టం పనులను పరిశీలించిన
-ఎస్ ఈ వేణుమాధవ్..
-ఎస్ ఈ వేణుమాధవ్..
మల్లాపూర్,(జనంసాక్షి)జులై:23 మల్లాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్ లను జగిత్యాల జిల్లా ఎస్ ఈ వేణుమాధవ్ పరిశీలించారు.
మొగిలిపేట గోదావరీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు ప్రత్యక్షంగా పరిశీలించి సత్వరం పూర్తి చేయుటకు ఎక్కువ మొత్తంలో కార్మికులను వినియోగించాలని స్థానిక అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
రైతులకు కొట్టుకుపోయిన, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ స్థానంలో కొత్తవి అందించి పంటలు కాపాడాలని సూచించారు.
ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో విద్యుత్ శాఖకు సుమారు 3.89కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
మొత్తం పడిపోయిన 2315స్తంబాలకు గాను 1122 కొత్తవి అమర్చామని, కాలిపోయిన 345 ట్రాన్సఫార్మర్ లకు గాను 172 కొత్తవి అమర్చామని తెలిపారు.
ఇంకా 1193 స్తంభాలు, 173 ట్రాన్స్ఫార్మర్స్ మరో రెండు రోజుల్లో పూర్తిచేసి యధాతధ స్థితి నెలకొల్పుతామని పేర్కొన్నారు.
ఇంతటి వర్షాలలో కూడా సిబ్బంది మొక్కవోని ధైర్యంతో రేయింబవళ్లు పనిచేసి చివరి వినియోగదారునికి కూడా అదే రోజు విద్యుత్ సరఫరా అందించడం వారి నిబద్ధతకు నిదర్శనం అని అభినందించారు.
ఈ సందర్శనలో మెటుపల్లి డీ ఈ గంగారాం, ఏ డీ ఈ మనోహర్, ఏ ఈ లు రమేష్, అజయ్, రాకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
,(జనంసాక్షి)జులై:23 మల్లాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్ లను జగిత్యాల జిల్లా ఎస్ ఈ వేణుమాధవ్ పరిశీలించారు.