వరద నష్టాల పై ప్రతిపాదనలు తయారు చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
అంటువ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు
ప్రతి నీటి ట్యాంకులు శుభ్రం చేయాలి
చెరువు గుంటలో చెత్తచెదారం శుభ్రం చేయాలి
4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే పూర్తి చేయాలి
జగిత్యాల జులై 18:- భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నష్టం పై అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ నువ్వంటే అంశాలపై జిల్లా అధికారులు, తహసిల్దారులు ఎంపీడీవోలతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కన్వెన్షన్ సమావేశం నిర్వహించారు.
గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురిసి పెద్ద ఎత్తున జిల్లాలో వరద వచ్చినప్పటికీ జర్నలిస్టు జమీర్ మరణం మినహాయించి ప్రాణ నష్టం జర్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులను కలెక్టర్ అభినందించారు.
వరదలు అనంతరం అంటు వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నాయని, వీటి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 3 రోజులలో గ్రామాలలో, మున్సిపాలిటీ లలో పారిశుధ్య పనులు పూర్తిచేసి పూర్వపు స్థితి తీసుకురావాలని, దీనికోసం గ్రామాలలో మున్సిపాలిటీలలో అదనపు ప్రసిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని కలెక్టర్ సూచించారు.
మున్సిపాలిటీలో గ్రామాలలో ఉన్న ఖాళీ స్థలాలలో వర్షపు నీటి నిల్వలు, చెత్త నిర్మూలన వంటి పనులు చేపట్టాలని, సదరు భూ యాజమాన్యాలకు నోటీసులు జారీచేసి జరిమానా వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి కొనుగోలుకు కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారి, కమిషనర్లు సమన్వయంతో కొనుగోలు ప్రత్యేక పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
భారీ వర్షాల కారణంగా పంట నష్ట వివరాలు, పాక్షికంగా పూర్తిగా నష్టపోయిన ఇండ్ల వివరాలు, పంచాయతీ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, నీటి పారుదల కింద నష్టపోయిన చెరువుల వివరాలు తో కూడిన నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి నీటి ట్యాంకును క్లోరిన్తో శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో నిర్మాణాల శిథిలాలు, చెట్ల కొమ్మలు వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
వరద నీరు నిల్వ ఉన్న ప్రదేశాల నుంచి మోటార్ల ద్వారా నీరు తరలించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో నిండిన చెరువుల వద్ద గుంతలలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చెత్తాచెదారం తొలగించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రదేశాలలో మెడకల్ క్యాంపులు నిర్వహించాలని, 4 రోజులలో జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కోరుట్లలో కొన్ని ప్రాంతంలో నీరు నిలువ ఉండడం కారణంగా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, వాటినే త్వరితగతిగా విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రామస్థాయిలో పంట నష్ట వివరాలు సేకరించామని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే రైతు వారీగా పంట నటి వివరాలు సేకరిస్తామని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పడిపోయిన చెట్లు, నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య పనులు పొగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
బీర్పూర్ మండలంలో 100% మన ఊరు మనబడి పనులు గ్రౌండింగ్ చేశారని, మిగిలిన మండలాల్లో సైతం పనులు గ్రౌండింగ్ అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు ప్రతిపాదనలు తయారుచేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. హరితహారం లక్ష్యాలు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లతా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.