వరద బాధితులకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఎం

ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వారంలో సమస్య పరిష్కరిస్తాం కలెక్టర్ హామీ. అలంపూర్ జులై 26 (జనం సాక్షి )
వరద బాధితులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే వరకు సీపీఎం పార్టీ అధ్వర్యంలో దశల వారీగా పోరాటం చేస్తామని జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి అన్నారు.మంగళ వారం వరద బాధితులకు ఇండ్ల స్థలాలు చూపించాలని సీపీఎం పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి మాట్లాడుతూ 13ఎండ్లు గడుస్తూన్న పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించడంలో అధికారులు పాలకులు నిర్లక్ష్యం చేశారని వారం రోజుల లోపు వరద బాధితులకు స్థలాలు పంపిణీ చేయక పోతే బాధితులను సమీకరించి సిపిఎం పార్టీ అధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు.వరద బాధితుల కోసం కేటాయించిన స్థలంలో రైతు వేదికను నిర్మాణం చేశారని, మళ్ళీ ఇపుడు సమీకృత మార్కెట్ యార్డు పనులు జరుగుతున్నాయనిపట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపకపోతే పనులు అడ్డుకుంటామని ఆయన అన్నారు.రైతు వేదికకు సమీకృత మార్కెట్ యార్డు కు నిర్మాణం చేస్తున్న పాలకులు, అధికారులు వరద బాధితులకు స్థలాలు పంపిణీ చేయడములో శ్రద్ద చూపడం లేదని అన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.లేని ఎడల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాధితులు టి ఆర్ ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.గతములో అనేక సార్లు వరద బాధితుల ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆందోళన పోరాటాలు చేశామని గుర్తు చేశారు.812 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్నారు. ఇంకా పట్టాలు ఇవ్వని వారి కోసం మరో 20 ఎకరాలు భూమి కొనుగోలు చేసి ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దెలు కూలుతున్నయని, ఒకే గదిలో 2,3కుటుంబాలు దుర్భరమైన జీవితం జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్ ఎస్ పి పంపు మోటార్లు మునిగి ఇండ్లుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని అన్నారు.వరద బాధితులకు ఇండ్ల స్థలాలు చూపించాలని తహశీల్దార్ కార్యాలయం లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జీ తహశీల్దార్ శుబాష్ నాయుడు కలెక్టర్ ను ఫోన్లో సంప్రదించి సమస్యను వారం లోపు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమములో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి.రాజు,అర్.దేవదాసు, ఈ దన్న ,మండల కార్యదర్శి బి.నరసింహ,నాయకులు నాగరాజు,మౌలాలి,అయ్యప్ప, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.