వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలి

-టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు

మల్లాపూర్, (జనంసాక్షి)జులై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలను సందర్శించిన కృష్ణారావుమాడల్ స్కూల్ వెళ్లే రోడ్డు తెగిన రోడ్డును పరిశీలన చేశారు గోదావరి పరివాహక ప్రాంతంలోని వాల్గొండ మరియు వాల్గొండ తండా దామరాజు పల్లి గ్రామాలను సందర్శించి ఇల్లు కూలిపోయిన బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడతామని బాధితులకు వివరించారు . అలాగే వాల్గొండ గ్రామంలో ఇటీవలే తెగిపోయిన చెరువు ను పరిశీలించారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ వాతావరణ శాఖ ముందస్తుగానే తుఫాను హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినది అని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేకపోయారని కృష్ణ రావు పఆరోపించారు ఈ వరదల్లో నష్టపోయిన బాధితులకు తక్షణసహాయం క్రింద 50 వేల రూపాయలు అందించాలని పునరావాసము ఏర్పాటు చేయలని నిత్యావసరాలు అందించాలని అన్నారు దీంతోపాటు ఇల్లు కోల్పోయిన
బాధితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసి వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు పంట నష్టం తీవ్రంగా ఉందని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు అలాగే పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయిఅని ఇసుక మేటలు వేసిన పంట పొలాలకు ఎకరానికి 25 వేల రూపాయలు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు వాల్గొండ గ్రామంలోని చెరువును వెంటనే మరమ్మతు చేయాలని మల్లాపూర్ మోడల్ స్కూల్ కి వెళ్లే రోడ్డును యుద్ధప్రాతిపదికన పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు