వరద ముంపు ప్రాంతాల్లో గంగుల బిజిబిజీ

ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తంముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తం
* ముందస్థు చర్యలతో  ఆస్థి, ప్రాణనష్టం లేవు
* వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ కాలినడకన సహాయక చర్యలు
* అంటువ్యాదులు ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు
* అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి)  :
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తూ, అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాలతో అన్నిరకాల ముందస్థు జాగ్రత్తలు తీసుకొని, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామన్నారు. ముందస్థుగా ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు, నీటి నిలువ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మానేరు ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.  గురువారం ఉదయం నుండి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో వర్షంలోనే తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు, నగరంలోని వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ స్వయంగా కాలినడకన తిరుగుతూ ప్రజల మంచి చెడుల్ని తెలుసుకున్నారు. ఇరుకుల వాగు ఉధృతి పెరుగుతుండడంతో అక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న తొమ్మిది మంది వేరే రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను కాపాడి స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అంటువ్యాదులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నామని ముసురుకు తోడు, వరదతో నీళ్లు నిండిన ప్రాంతాల్లో సంచార వైద్య బ్రుందాలను తిప్పుతున్నామని ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తక్షణమే స్పందిస్తున్నామన్నారు మంత్రి గంగుల. నగరంతో పాటు జిల్లా మొత్తంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్న మంత్రి, ఇందుకోసం యావత్ ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. మానేరు, ఇరుకుల వాగుల పరివాహకంలో సంపూర్ణ జాగ్రత్త చర్యల్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విద్యుత్ స్థంబాలు, నీటి కుంటల వద్దకు వెల్ల్లోద్దని విజ్నఫ్తి చేసారు మంత్రి గంగుల కమలాకర్.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్. కలెక్టర్ కర్ణన్, అన్ని శాఖల జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.