వరద మునక నుంచి తేరుకుంటున్న మంథని.
బురదతో నిండుకున్న రోడ్లను ఫైర్ ఇంజిన్ ద్వారా శుభ్రం చేపిస్తున్న మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ జనం సాక్షి, మంథని : గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టడంతో పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం వరద ముంపు నుంచి తేరుకుంటున్నది. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీట మునిగి తేలిన అంబేద్కర్ చౌక్ వరకు రోడ్లను పరిశీలించి బురదతో నిండుకున్న రోడ్లను ఫైర్ ఇంజిన్ ద్వారా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ స్వయంగా దగ్గరుండి శుభ్రం చేపిస్తున్నారు