వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జన గణ మన గీతాలాపన
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :16
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అర్చన పండుగ ఏడు గంటల పాటు జనగణమన గీతాలాపన చేశారు . స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ గీతం సంపూర్ణ జనగణమన గీతాలాపన 75 సార్లు, సుమారు 7 గంటల పాటు ఆలపించారు. నిబంధనలకు లోబడి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి అనుమతితో పాడారు. ఈ కార్యక్రమాన్ని నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పండుగ అర్చన మాట్లాడుతూ మన భారతదేశ జాతీయ గీతం విశిష్టతను ప్రపంచం నలుమూలల తెలపాలనే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు. పూర్తిగా నిబంధనలకు లోబడి 75 సార్లు ఐదు చరణాలలో ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. అనంతరం నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో జాతీయ భావం నింపాలని కరీంనగర్ నగరంలో అనేక చౌరస్తాలలో నిత్య జాతీయ గీతాలాపన మొదలు పెట్టడం జరిగింది అని పేర్కొన్నారు. దేశం కోసం ఎదైనా సాధించాలని తపన ప్రతి యువతలో ఉండాలన్నారు. అర్చన చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. గీతాలాపన చేస్తున్న అర్చన పండుగను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ తో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కుమార్, తిరుపతి, సాదవేణి వినయ్, పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు