వరికోతలు ప్రారంభమై పక్షం రోజులైనా ప్రారంభించని వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు

పెగడపల్లి నవంబర్ 5(జనం సాక్షి )పెగడపల్లి  మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరికోతలు ప్రారంభించి పదిహేను రోజుల పైనే అవుతున్న మండలంలో ఒక్కచోట కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి కేంద్రాలు ప్రారంభించాలని అలాగే వర్షాకాలంలో బారి వర్షాల వల్ల అనేక మంది రైతుల పొలాలు నష్టపోయాయని తప్ప,తాలు పేరుతో తూకంలో కటింగ్ చేయకుండా రైతులను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు దీకొండ మహేందర్ కోరారు ఈ కార్యక్రమంలో రైతులు ఏనుగుల కొమురయ్య,గుంటి ఓదెయ్య, సుంకే అంజి,దీకొండ లచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు