వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

*
మెట్పల్లి టౌన్, నవంబర్ 12 ,
జనంసాక్షి:
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో విశాల సహకార సంఘం మెట్పల్లి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మార్కెటు కొనుగోలుకు తీసుకువచ్చే ప్రతి రైతు సంతోషంతో ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కడ గ్రామాల అక్కడ వరి కొనుగోలు కేంద్రాలు పెట్టినట్టు అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో పరిసరాల పట్టణ గ్రామ రైతులకు సౌలభ్యం కోసం ప్రారంభించడం జరిగిందని తేమ లేకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి కాంటా చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళొచ్చని అలాగే రైతులు పండించిన వారి ధాన్యాలకు మద్దతు ధర 2060 రూపాయల గా నిర్ణయించడం జరిగిందని దళారులకు అమ్మకుండా వ్యవసాయ మార్కెట్లో గాని ఇతరత్రా గ్రామాల్లో గాని కొనుగోలు కేంద్రంలో అమ్మి లబ్ధి పొందాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల లింగారెడ్డి, వైస్ చైర్మన్ సంజీవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, గోరువంతులు మారుతి, చర్లపల్లి హనుమాన్ గౌడ్, జరుపల రాయల్ నాయక్, గాజా రాజా రెడ్డి ,సరోజన, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొమ్ముల రాజేశ్వర్ రెడ్డి, రాములు, ప్రమీల, తిరుపతి, వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ రమణ, తదితరులు నాయకులు పాల్గొన్నారు