వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకేపి ఆధ్వర్యంలో మండలంలోని చిగురుమామిడి,బొమ్మనపల్లి, ఇందుర్తి గ్రామాలలో, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తేమ 17% లోపు ఉండేటట్టు తాలు లేకుండా చూసుకొని సెంటర్ కు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర “ఏ” గ్రేడ్ 2060/- రూపాయలు కామన్ ధర 2040/- రూపాయలు పొందాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి రైతులు ఎవరు మోసపోవద్దని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు సాంబారి కొమురయ్య, తహశీల్దార్ ముబీన్ అహమ్మద్, ఎంపీడీవో నర్సయ్య, ఎస్సై దాస సుధాకర్, ఏపీఎం మట్టెల సంపత్, ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి మెంబర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మహిళా సంఘాల అధ్యక్షులు, వివోఏలు, రైతులు, సెంటర్ ఇన్చార్జిలు సత్యనారాయణ, వెంకటమల్లు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు