వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి…

**తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి
కరీంనగర్ టౌన్ నవంబర్ 11(జనం సాక్షి)
జిల్లాలో గత 20 రోజులుగా అన్నదాతలు పండించిన వరి ధాన్యం దిగుబడులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అధికారుల అలసత్వంతో కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాక రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున ముకుంద లాల్ మిశ్రా భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జూన్తుల జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రారంభించిన ధాన్యం కొనుగోలు సెంటర్లో సైతం దాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి కొనుగోలు చేయని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ ధాన్యానికి 8 నుండి 12 కిలోలు కోత విధిస్తున్నారని అలాంటి రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. నేషనల్ హైవే పేరుతో రైతుల భూములను అప్పనంగా లాక్కుంటే ఊరుకునేది లేదని 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈనెల 27 28 29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నట్లు మహాసభలకు జిల్లా నుండి 23 మంది ప్రతినిధులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.మొదటిరోజు బహిరంగ సభకు జిల్లా నుండి 400 మంది రైతులు వెళుతున్నట్లు చెప్పారు .డిసెంబర్ 13 14 15 16 తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ 35వ మహాసభలు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో నిర్వహించుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఈ మహాసభలకు జిల్లా నుండి ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం వాసుదేవ రెడ్డి శీలం అశోక్ గుండేటి వాసుదేవ్ జిల్లా కమిటీ సభ్యులు పప్పు నారాయణ శ్రీనివాస్ రెడ్డి రమాదేవి పాపిరెడ్డి మల్లయ్య గంగారెడ్డి కృష్ణారావు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు