వరి సాగులో తెలంగాణ దేశంలోనే నెం.1
` అత్యంత పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
` ఎప్పటికప్పుడు రైతులకు డబ్బుల చెల్లింపులు
` వానాకాలం ముందస్తు సాగు రైతులను సన్నద్దం చేయాలి
` ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలి
` అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం
` అనర్హులకు అందిస్తే అధికారులపై చర్యలు తప్పవు
` ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో(జనంసాక్షి):గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాలేశ్వరం, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ లో నుంచి చుక్క నీరు రాకున్నా అధికారుల సహకారం ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల అత్యధికంగా వరి సాగైందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కా న్సింగ్, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, చిన్నమైలు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెండిరగ్ ప్రాజె క్టులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, వరి ధాన్యం కొనుగోళ్లపై దాదాపు నాలుగు గంటల పాటు మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపి లను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీ సిల్టేషన్ ఆధునిక పద్దతుల్లో పూర్తి చేసి పూర్వపు సామర్థ్యం తీసుకొని వస్తామని అన్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు. యాసంగి సీజన్ లో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిరదని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సాగు జరగలేదన్నారు. దేశంలో వరి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రాజెక్టులలో ఉన్న నీళ్లు సమర్ధవంతంగా వినియోగించడం వల్ల పెద్ద ఎత్తున పంటలు పండాయన్నారు.సాగునీటిని పొదుపు క్రమంగా వాడటం వల్లే పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు.యాసంగి పంట సన్న రకాల వడ్లను బాయిల్డ్ రైస్ గా మార్చేందుకు ప్రభుత్వం రైస్ మిల్లులో ప్రతిపాదనలు ఆమోదిస్తుందని అన్నారు. ఈ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను చర్చిస్తామని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం అమలు కావడంలేదని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ కు నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. జ్యూడిషియల్ కమిషన్ నివేదిక ప్రకారం తప్పనిసరిగా చర్యలు ఉంటాయని అన్నారు. మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ దగ్గర అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో చర్చించి త్వరలోనే పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాలన దక్షత కారణంగా దేశంలోనే అత్యధికంగా వరి పంట మన తెలంగాణ రాష్ట్రంలో సాగు జరిగిందని, అదే స్థాయిలో భారీ ఎత్తున కొనుగోలు కూడా చేశామని అన్నారు. ఎన్.డి.ఎస్.ఏ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి నిరంతరం జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత పాలకుల హయాంలో రైస్ మిల్లుల వద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులు గురయ్యారని , ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడ ఇబ్బంది రాలేదని అన్నారు. మలక్ పేట, సూరమ్మ, మోతే నారాయణ పూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టు పనులు వేగవంతం పూర్తి చేయాలని కోరారు. పదేళ్ల కాలంలో వందల ఇండ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 3500 ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి కేటాయిస్తున్నదని తెలిపారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైస్ మిల్లుల దగ్గర ఎక్కడైనా ధాన్యం కోత విధిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పెండిరగ్ ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భవిష్యత్తు లో మంజూరు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా ప్రజల్లో మంచి పేరు వచ్చిందని అన్నారు. భూ భారతి సంబంధించి సమస్యల పరిష్కారం బాగా జరుగుతుందని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో 43 వేల 100 ఎకరాల పైగా ఆయకట్టుకు సాగు నీరు కలికోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా అందుతుందని, దీనికి ప్రభుత్వం 320 కోట్లు మంజూరు చేసిందని, భూ సేకరణ నిధులు వస్తే కుడి ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అన్నారు. వరద కాలువ పై 15 కోట్లతో క్రాస్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 9 కెనాల్ పనులు పూర్తి చేయాలని, ఎగువ మానేర్ వరకు ఈ నీళ్ళు అందించేందుకు 10 కోట్ల విడుదల చేయాల్సి ఉందని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించిందని త్వరలో పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. శృంగేరి పీఠం.. ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల ఇలవేల్పుగా నిలిచే రాజన్న ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, డీ -83 కాలువలు పూర్తి స్థాయిలో మీరు రావడం, రాముడు ఎత్తిపోతల పథకం పూర్తి కావడం వల్ల రామగుండం ప్రాంతంలో 40 వేల మెట్రిక్ టన్నుల కు పైగా పంట దిగుబడి వచ్చిందని అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ జరిగిందని , సన్న రకం వడ్లకు బోనస్ అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు చేశామని అన్నారు . పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సింగరేణి కి సంబంధించిన భూములు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బండల వాగు ఎత్తిపోతల పథకం పూర్తయిందని, దీనిని అధికారికంగా ప్రారంభించాలని, అదేవిధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటీ కేటాయింపులు చేసి పూర్తి చేయాలని, పత్తిపాక రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని కోరారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం వల్ల ఎలాంటి ప్రాంతం భూములకు సాగునీరు అందుతుందని, తద్వారా రైతులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ రa, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జే.అరుణ వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.