వర్షం పడితే రెండుగ్రామాలకు తెగతెంపులే
జుక్కల్, అక్టోబర్ 15,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం పోచారం నుండి పోచారం తండాకు వెళ్ళే దారిలో బ్రిడ్జి కూలింది. వర్షం పడితే ఆ రెండుగ్రామాలకు తెగతెంపులే. ప్రస్తుతం శనివారం కురుస్తున్న వర్షాలకు ఈ కూలిన బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహిస్తోంది. పోచారం తండా వాసులు ఈ బ్రిడ్జి కి ఆవల ఉన్న తమ పొలాల్లో వ్యవసాయ పనులకు వెళ్తారు.తమ పశువులను మేతకు తీసు కెళ్తారు. వారు ప్రహిస్తున్న నీరు తగ్గే వరకు తండాకు వెళ్ళే పరిస్థితి లేదు.ఈ బ్రిడ్జి కూలి సంవత్సరాలు గడుస్తున్నా అధికారులకు నాయకులకు ఎంత మొరపెట్టుకున్నా పనులు చేపట్టడం లేదని తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పంచాయారాజ్ ఇంజనీరింగ్ అధికారులు చూసి వెళ్లారని, అయినా ఇంకా ఎలాంటి పనులు చేపట్టలేదని వారు తెలిపారు.మా ఇబ్బందులు గమనించి తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Attachments area