వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మఖ్తల్ జూలై 09 (జనంసాక్షి) వర్ష కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్వ యస్ ఐ విక్రమ్ పలుసుచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల ప్రజలు
వర్షాకాలంలో వానలు ఎక్కువ పడుతున్నాయి కావున ప్రజలు ఎవరు వాగుల దగ్గరికి వెళ్ళరాదు. వాగుల దగ్గర చేపలు పట్టడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకో రాదు అని అన్నారు మట్టి గోడలు, పాడుబడిన ఇండ్లలో నివసించరాదు. ఏవైనా రోడ్లు తెగి పోయినప్పుడు, వాగులు వచ్చినప్పుడు పోలీసువారికి తెలియపరచాలి. బైకులపై వెళ్లేటప్పుడు రోడ్లపై స్కిడ్( జారుడు) అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉన్నందున మీయొక్క వాహనాలను జాగ్రత్తగా నడవవలెను అని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు