వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామానికి బయటి ప్రపంచానికి బంధాలు కట్

చేవెళ్ల జులై   (జనంసాక్షి)
వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు కరాబ్ కావడంతో పక్క గ్రామాలకు మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుందని ఎర్రోను కొట్టాల గ్రామస్తులు అన్నారు.
చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డి గూడ అనుబంధ గ్రామమైన ఎర్రను కొట్టాల గ్రామంలో వర్షాలకు గ్రామంలోని రోడ్లు మొత్తం సర్వనాశనం అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. రోడ్లు చిన్నగా ఉండడంతో ఊరిలోకి పాదాచరులు, మోటార్ సైకిల్ తప్ప పెద్ద వాహనాలు రాని పరిస్థితి ఉందని, ముఖ్యంగా ఊరిలో స్కూల్ కూడ లేనందున విద్యార్థులు మండల కేంద్రమైన చేవెళ్ల కు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు రోడ్డు సరిగా లేకపోవడంతో చాలా సమస్య ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్న దున్నపోతు మీద వాన పడినట్టు ఉందని అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులు అన్నారు.
Attachments area