వర్షాలు తగ్గేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలి

 

* జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
భారీ వర్షాల వల్ల పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరూ వర్షాలు తగ్గేంతవరకు అక్కడే ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
గురువారం గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయం పాఠశాల లోని పునరావాస కేంద్రంలో ఉన్న ఇస్తారిపల్లి గ్రామస్తులను కలెక్టర్ కలసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల నారాయణపూర్ చెరువు కట్ట తెగిపోయి విపరీతంగా నీరు ప్రవహిస్తున్ననందున ఇస్తారిపేట గ్రామంలోని ఇళ్లలో నీరు ప్రవహించి ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉన్నందున గ్రామస్తులను అక్కడి నుండి తరలించి గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయం లోని పునరావాస కేంద్రంలో వసతి కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పునరావాస కేంద్రంలోని వారితో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున త్రాగు నీరు, భోజన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. వర్షాలు తగ్గేంతవరకు పునరావాస కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రామడుగు లోని బ్రిడ్జిని కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి పరిశీలించారు

ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, కరీంనగర్ ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.