వర్షాలు బాగా కురిసి పంటలన్నీ బాగా పండి గ్రామస్తులంతా సుఖసంతోషాలతో మెలగాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
జనం సాక్షి జూలై 7 మోమిన్ పేట
వర్షాలు బాగా కురిసి పచ్చని పంటలు పండినపుడే రైతు కళ్లలో సంతోషం విరాజిల్లుతుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ పేర్కొన్నారు. గత ఏడాది గండి మైసమ్మ ఆలయం నిర్మించిన సంగతి విదితమే. ఆలయం వార్షికోత్సవం పంగా సంజీవరెడ్డి, నర్సింహారెడ్డి, యాదవరెడ్డిల అధ్యక్షతన గురువారం మోమిన్ పేట మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామంలో నిర్వహించారు. వేదపండితుల మధ్య వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని నిర్వహించిన గండి మైసమ్మ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు గండి మైసమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించి, వర్షాలు కురిసి పంటలు పండి సిరిసంపదలతో దీవించాలని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బస్వరాజు, మహిపాల్, రాచప్ప, రాంరెడ్డి, కిషోర్, నర్సింలు, ఈశ్వరయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.