వర్షాల కారణంగా మాలమహనాడు ప్రజాపాదయాత్ర తాత్కాలిక వాయిదా
జాతీయ మలమహనాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ.
అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్09,(జనం సాక్షి )న్యూస్ : స్థానిక పట్టణంలోని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ , ఆల్ ఇండియా అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క బాలకిష్టయ్య తో కలిసి పత్రిక ప్రకటన వెలువడించారు.ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలైన ఓడ రేవులను,ఎల్ ఐ సి, ఆట ప్రాంగణాలు,ప్రభుత్వ బ్యాంకులు,బొగ్గు గనులను,విమానాశ్రయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్,విద్యుత్ లైన్ లు,గోదాములు,బిఎస్ ఎన్ ఎల్, నేచురల్ గ్యాస్ లైన్లను, ఇంధన సంస్థలను,రైల్వే లను ప్రయివేటు సంస్థలకు అమ్ముతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తునందుకు నిరసనగా ఈ నెల 9 తేదీన నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం నుండి హైదరాబాద్ కు చేపట్టే ప్రజా పాదయాత్ర ను భారీ వర్షాల నేపథ్యంలో పాదయాత్ర ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వలన ప్రజా పాదయాత్ర కు అంతరాయం కలుగుతుందని దీనివలన పాదయాత్ర సుజావుగా కొనసాగే అవకాశం లేనందున ప్రస్తుతం ప్రజా పాదయాత్ర ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.అలాగే ప్రజా పాదయాత్ర కు అనుకూల వాతావరణం పరిస్థితులు నెలకొన్న తర్వాత తదుపరి ప్రజా పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన తేదీ షెడ్యూల్ ను వెల్లడిస్తామని తెలిపారు. కావున ఈ విషయాన్ని ప్రజలు,మేధావులు,బహుజన ప్రజానీకం గమనించాలి అని కోరారు.కార్యక్రమంలో టి ఎస్ ఆర్ టి సి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఇమ్మడి జనార్దన్, బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు సామ శ్రీనివాసులు ,గురుకుల పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ యూనియన్ జిల్లా నాయకులు జక్క సంపత్ కుమార్,జూబ్లీహిల్స్ అధ్యక్షుడు సంకీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.