వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి. *అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్..
ఖమ్మం జిల్లా తిరుమలరావు పాలెం. (అక్టోబర్12) జనం సాక్షి. జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారంనాడు అఖిల భారత రైతు కూలీ సంఘం పాలేరు డివిజన్ కార్యవర్గ సమావేశం బి.శంకర్ అధ్యక్షతన పిండిపోలు గ్రామంలో జరిగింది.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగిస్తూ వర్షాలు వల్ల ఖరీఫ్ పంటలు ప్రారంభ దశలోనే దెబ్బతిన్నాయని, ఇప్పుడు పంట చేతికి వచ్చే దశలో వర్షాలు నిరంతరాయంగా పడుతుండడంతో భారీ నష్టం ఏర్పడిందన్నారు. పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్నారు. నిరంతర వర్షాల వల్ల వేలాది ఎకరాలు తెగుళ్లు, చీడపీడలు సోకి పత్తి, వరి ,మిర్చి , మొక్కజొన్న తదితర పంటల దిగుబడుల పై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్నారు.జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాల వల్ల వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.
పంటలు నష్ఠాన్ని అంచనా వేయడానికి సర్వే చేసి, పరిహారం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు వారికి ఏమీ పట్టనట్లుగా ఉండటం రైతులకు అన్యాయం చేయడమే అన్నారు.
పంటల బీమా అమలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకున్నాయన్నారు.
రైతాంగ అప్పులను రద్దు చేయకపోవడం వల్ల పెన్షన్లు వచ్చిన వారి పెన్షన్లను కూడా బ్యాంకు వాళ్ళు అప్పులకి మినహాయించుకుంటున్నారని పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీరామ్ సాగర్ రెండవ దశ పనులు వెంటనే పూర్తి చేయాలని,పంటకాలువ పనులను ప్రభుత్వమే భరించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా నాయకులు బంధెల వెంకయ్య ,డివిజన్ కార్యదర్శి రేపాకుల శివలింగం, నాయకులు కే నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వర్లు, తుపాకుల నాగేశ్వరరావు, రెంటాల యాదగిరి, పోటు నాగేశ్వరరావు, వెంకట అప్పారావు, తదితరులు పాల్గొన్నారు…
Attachments area