వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వర్షాల వల్ల నష్టపోయిన వారిని తక్షణమే ఆదుకోవాలని సిపిఐ ( ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతూ స్థానిక విక్రమ్ భవన్ ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులు, చిరు వ్యాపారాలు, కూలీ పనులు చేసుకొని జీవనం గడిపే వాళ్లు, ఇండ్లు కూలి నివాసం ఉండలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నారు.పంట నష్టపోయిన వారికి ఎకరానికి రెండు లక్షలు, చిరు వ్యాపారస్తులకు రూ.50వేలు, ఇల్లు కూలిన వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని లేని పక్షంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని అన్నారు.మంత్రి , సంబంధిత అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక , నాయకులు రామన్న , పిడిఎస్ యు అధ్యక్ష , కార్యదర్శులు ఎర్ర అఖిల్, పుల్లూరు సింహాద్రి , వెంకటమ్మ , పద్మ , శైలజ, జీవన్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు.