వర్సీటీల కాషాయీకరణను అడ్డుకుందాం

3

– భావాప్రకటన స్వేచ్ఛా విద్యార్థులకు ఉండాలి

– రాహుల్‌

ఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటినుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న యూనివర్సిటీల కాషాయీకరణను అడ్డుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. యూనివర్సిటీల్లో కొత్త ఆలోచనలు వెలుగు లోకి రాకుండా కేంద్రం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. హెచ్‌సియూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ వేములకు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో రాహుల్‌ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అమలు చేస్తూ విద్యార్థుల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. భారత భవిష్యత్తుపై రోహిత్‌ ఎన్నో కలలు కన్నారని, కాని ఆ కలలను ఆర్‌ఎస్‌ఎస్‌ కల్లలు చేసిందని రాహుల్‌ విమర్శించారు. ప్రతి ఒకరికి వాక్‌ స్వాతంత్రం ఉండాలని, తన మనసులోని మాటను బయటకు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్న భారత్‌ కావాలని యువత కోరుకుంటోందని రాహుల్‌ పేర్కొన్నారు.

ఢిల్లీ విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తం

హెచ్‌సియూ విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా ఢిల్లీలో విద్యార్ధి సంఘాలు తలపెట్టిన ర్యాలీ, సభ ఉద్రిక్తంగా మారింది. సభలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ప్రసంగిస్తున్నప్పుడు ఓ విద్యార్ధి అడ్డుకున్నాడు. ఆ విద్యార్ధిపై సభకు హాజరైనవారు చేయి చేసుకున్నారు. కేజ్రీవాల్‌  ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు ఏబీవీపీ విద్యార్ధి నాయకుడిపై దాడి జరిగిందని తెలుస్తోంది. దత్తాత్రేయను, స్మృతీ ఇరానీని తప్పించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. దళిత విద్యార్ధుల గొంతు నొక్కేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని కేజీవ్రాల్‌ ఆరోపించారు. తీరు మార్చుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి విద్యార్ధులు తగిన పాఠం నేర్పుతారని కేజీవ్రాల్‌ చెప్పారు. మోదీ ప్రభుత్వం రావడంతో మంచి రోజులు రాలేదని, చెడు రోజులు మాత్రం వచ్చేశాయని కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ వేముల, దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదంలో అరెస్టైన కన్నయ్యకుమార్‌లకు మద్దతుగా విద్యార్థి సంఘాలు దిల్లీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతిచ్చారు. జంతర్‌ మంతర్‌ నుంచి కిలోవిూటరు దూరం పాటు జరిగే ఈ ర్యాలీలో పలువురు, విద్యార్థులు, మేధావులు పాల్గొంటారు. కన్నయ్యను విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించి రోహిత్‌కు న్యాయం చేయాలంటూ ఈ కార్యక్రమం చేపట్టారు.