వాజ్‌పేయిని పిలువం

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంపె విచారణలో భాగంగా మాజీ ప్రదాని అటల్‌ బిహర్‌ వాజ్‌పేయిని తామ ముందు హాజరుకావాలని కోరబోమని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) చైర్మెన్‌ పీసీ చాకో స్పష్టం చేశారు. ”వాజ్‌పేయి రక్షణశాఖ మాజీ మంత్రి జార్జీ ఫెర్నాండెజ్‌ల అనారోగ్యం కారణంగా వారిని పిలువబోవడంలేదు” అని చాకో పేర్కున్నారు. జేపీసీ కార్యలయం సాక్షుల జాబితాలో వారిద్దరి చేర్చడంపై అయన విచారణ వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ హయంలో జగ్‌మోహన్‌ రాజీనామాతో వాజ్‌పేయి కొద్ది కాలం టెలికం శాఖను నిర్వహించారు. టెలికం వ్యవహరాల ఏర్పాటైన మంత్రుల బృందానికి ఫెర్నాండెజ్‌ నేతృత్వం వహించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి పేర్లను సాక్షుల జీబితాలో చేర్చారు.