వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో

ప్రముఖ ఫార్మసిస్ట్ లకు ఘనసన్మానం.
భువనగిరి, జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గల వాత్సల్య ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా ప్రముఖ ఫార్మసిస్ట్ లు జిల్లా మెడికల్ వైద్య ఆరోగ్యశాఖ ఫార్మసీ రంగంలో విశిష్ట సేవలు అందించిన మహనీయులకు గుర్తింపుగా ఫార్మసిస్ట్ లను క్యాసనూరు సిద్దేశ్వర్
మరియు పుట్టపర్తిని శ్రీశైలం గారిని వాత్సల్య ఫార్మసీ కళాశాల మేనేజ్మెంట్ దరిపల్లి నవీన్ కుమార్ మరియు దరిపల్లి ప్రవీణ్ కుమార్ . ఘణంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వాత్సల్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఫార్మసిస్టులకు ప్రత్యేకంగా ఈ రోజును జరుపుకొనుటకు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఆవిర్భవించుటకు ముఖ్య భూమిక పాటించిన ఇంటర్నేషనల్ ఫార్ముసిటికల్ ఫెడరేషన్ యొక్క విశిష్ట సేవలు గురించి కొనియాడారు. వాత్సల్య ఫార్మసీ కళాశాల చైర్మన్ ఇంటర్నేషనల్ ఫార్మసిటికల్ ఫెడరేషన్ వాళ్లు 2009వ సంవత్సరంలో ఇస్తాంబుల్ టర్కీ దేశంలో ఏర్పాటు చేసిన సదస్సులో సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం జరుపుటకు తీర్మానించినారని తెలియజేసినారు. ఈ దినము మొదలుకొని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 25 వ తారీఖున ఒక క్రొత్త నినాదంతో జరుపుకొనుచు, ఫార్మసీ రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సన్మానించుచూ, ముందుకు సాగుతున్నారు. వాత్సల్య ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఫార్మసీలు యూనివర్సల్ సర్వైవర్ ఫర్ ద పబ్లిక్ హెల్త్ కేర్ అని, రానున్న కాలంలో ఫార్మాసిస్టులకు అత్యధిక డిమాండ్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము మరియు మూడో సంవత్సరం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా 24-09-2022 రోజున క్విజ్ పోటీలలో, ముగ్గుల పోటీలలో , రేఖ చిత్రం పోటీలలో, ఉపన్యాస పోటీలలో, వ్యాసరచన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫార్మసీ నీనాదమును ఆధారంగా చేసుకొని, 25-09-2022 హెల్త్ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా అనంతరం బస్ స్టాప్ దగ్గర విద్యార్థులందరూ మానవహారం గా ఏర్పడి ఫార్మసి యొక్క విశిష్టత చాటుతూ పలు రకాల నినాదాలు స్మరించినారు. ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు అందజేశారు. ఫార్మాసిస్ట్ డే కార్యక్రమము రెండు రోజుల ప్రోగ్రాంనకు వాత్సల్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిలకర వెంకట సురేష్ , వాత్సల్య ఫార్మసీ కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, వాత్సల్య ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, అసోసియేషన్ ప్రొఫెసర్ రవి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జ్యోతి, అశ్విని,రంగ లైబ్రేరియన్ ఉమ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.