వాల్మీకి మహర్షి జీవితాన్ని ముందుతరాల యువతి యువకులకు తెలియజేయాలి
-బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ నాయుడు
ఇటిక్యాల అక్టోబర్ 28 (జనంసాక్షి)
మనిషిలో మార్పు వస్తే మహర్షిలు అవుతారని, వాల్మీకి మహర్షి జీవితాన్ని ముందు తరాల యువతి యువకులకు తెలియజేయాలని అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ నాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు కోదండాపురం, తిమ్మాపురం, షాబాద, ఉదండాపురం, వావిలాల, సాతర్ల, చాగాపురం తదితర గ్రామాలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ నాయుడు హాజరై వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమన్నారు. కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. కుటుంబ పోషణ కోసం వేట గాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహా ముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారన్నారు. సమతా సమాజాన్ని రూపుమాపేందుకు వాల్మీకి చూపిన మార్గాన్ని ఉన్నత ఆశయాలను ప్రజలు అనుసరించాలన్నారు. అలాగే వాల్మీకి సంగం ఐక్యంగా ఉండి ఎస్టీ రిజర్వేషన్ కోసం ఉద్యమించాలన్నారు. అదేవిధంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ. సంపత్ కుమార్ హాజరై కోదండాపురం గ్రామంలో వాల్మీకి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, నాయకులు నీలి శ్రీనివాసులు, వెంకట్రాముడు, తిమ్మాపురం శివుడు, నాగేష్, రాఘవేంద్ర గారు, బొచ్చు లక్ష్మన్న, సాయిబాబా, కోటిరెడ్డి, మోహన్ రెడ్డి, బి వీరాపురం ఈదన్న నాయుడు, తిమ్మన్ననాయుడు తోపాటు తదితర వాల్మీకి సంగం నాయకులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.