వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గనిర్దేశనం
మక్తల్ అక్టోబర్ 09, (జనం సాక్షి) శ్రీరాముడి దివ్య చరిత్ర ను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన ఆది కవి వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గనిర్దేశనం అని భారతీయ కిసాన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కావాలి వెంకటేష్ అన్నారు. విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సమాజంలో ఎలా నడుచుకోవాలో రామాయణ మహా కావ్యం లో వివరించారని తెలిపారు. సమస్త ప్రపంచానికి రామాయణ మహాగ్రంథం ఆచరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే సత్యనారాయణ గౌడ్, బజరంగ్దళ్ జిల్లా సహాయ కార్యదర్శి వాటికి రమేష్, విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు డాక్టర్ రాజప్ప, బి కే ఎస్ మండల అధ్యక్షులు కర్ని శ్రీనివాసులు, బజరంగ్దళ్ మక్తల్ మండల ప్రముఖ నరేష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.