విండీస్‌కు బంగ్లా షాక్ : తొలి వన్డేలో ఘనవిజయం
ఖులానా, నవంబర్ 30: బంగ్లాదేశ్ పర్యటనలో వెస్టిండీస్‌కు తొలి షాక్ తగిలింది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న విండీస్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం చుక్కెదురైంది. బంగ్లా యువస్పిన్నర్ల ధాటికి విండీస్ విలవిలలాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు నామమాత్రపు ఆరంభా న్నిచ్చారు. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే సిమ్మన్స్‌ను మోర్తాజా ఎల్బీగా ఔట్ చేయడంతో విండీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. వెంటనే ధాటిగా ఆడుతోన్న గేల్ గజీ బౌలింగ్‌లో ఔట య్యాడు. గేల్ 35 పరుగులు చేశాడు. తర్వాత శామ్యూల్స్ డకౌటైనా బ్రేవో, పొల్లార్డ్ వేగంగా ఆడడంతో స్కోర్ పెరిగింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ దశలో తొలి వన్డే ఆడు తోన్న గజీ మరోసారి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. బ్రేవో 35 , పొల్లార్డ్ 15 రన్స్ చేసి వెనుదిరిగారు. తర్వాత బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థుతుల్లో సునీల్ నరైన్ ధాటిగా ఆడడంతో వెస్టిండీస్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది. నరైన్ జోరుతో 199 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో గజీ 4, రజాక్ 3 వికెట్లు తీసుకున్నారు. 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. సొంత ప్రేక్ష కుల మధ్ధతుతో వేగంగా పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. తవిూమ్ ఇక్బాల్ 58, హక్ 41 పరుగులు చేసి ఔటయ్యాక నయీంఇస్లాం, నాసిర్ స్సేన్ జోరు కొనసాగించారు. విండీస్ బౌలర్లు ప్రభావం చూపకపోవడంతో బంగ్లా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. చివరికి 40.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నయీం ఇస్లాం 50 , మష్ఫికర్ రహీమ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 వికెట్లతో అదరగొట్టిన గజీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. రెండో వన్డే డిసెంబర్ 2న జరగనుంది.