విఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సి‌ఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలు 22 నెలలు గడిచిన అమలుకు నోచుకోలేదని వీఆర్ఏ జాక్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సి‌ఎం కే‌సి‌ఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వి‌ఆర్‌ఏ లకు పే స్కేల్ ఇవ్వాలని, అర్హత కల్గిన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు.55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు.తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ప్రభుత్వ సహాయ నిరాకరణకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వి‌ఆర్‌ఏ జేఏసీ కో కన్వీనర్ షేక్ మహమ్మద్ రఫి, లక్ష్మళ్ళ నరసింహారావు, రాష్ట్ర విఆర్ఏల ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కినేపల్లి శ్రీను, సంఘ రాష్ట్ర  కోశాధికారి పాల్వాయి వెంకన్న , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల మల్లయ్య, జిల్లా విఆర్ఏల అధ్యక్షులు గొబ్బి నరసయ్య , జిల్లా విఆర్ఎ జేఏసీ చైర్మన్ అంజెపల్లి నాగమల్లేష్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు