వికసిత్ భారత్ లక్ష్యమట!
` సామన్యులకు లేదు ఊరట!
` మూడు కర్తవ్యాలు లక్ష్యంగా సాధనే లక్ష్యం
` ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం
ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ రేటు ఆకాంక్ష
బడ్జెట్‌లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. జాబితాలో హైదరాబాద్
బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత
మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణం
మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
2026`27 ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా
మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు
రూ.28.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు అంచనా
దీర్ఘకాలిక ఆర్థిక వద్ధికి సజనాత్మకత జోడింపు
కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటు
విదేశీ విద్యకు వెళ్లే వారికి ఊరట
టాక్స్ కలెక్టడె ఎట్ సోర్స్‌ను 2శాతానికి తగ్గింపు
కేంద్రబడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు
(అరుదైన ఖనిజ వనరులున్న రాష్టాలకు ప్రత్యేక ప్రోత్సాహం
ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడులో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు )
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని, యువశక్తి కేంద్రంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని, గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్ సభలో 2026`27 బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్.. మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు.. కాగా.. 2026`27 ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా వేశారు. 2027లో రూ.28.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు అంచనా వేశారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రజల ఆశయాలను అందుకోవడమే తమ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలియ జేశారు. ఈ బ్జడెట్ ను యువశక్తి బడ్జెట్‌గా అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని, రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలకు అభివద్ధి ఫలాలు చేరాలన్నారు. మూడు కర్తవ్యాలను స్ఫూర్తిగా తీసుకుని కర్తవ్యభవన్‌లో రూపొందించిన బడ్జెట్ ఇదంటూ పేర్కొన్నారు.నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కార్యవ్యాలను సాధిస్తామని, ఇది యూనిక్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ ఉంటుందని అన్నారు. కర్తవ్యం1: సమ్మిళిత ఆర్థిక వద్ధి. కర్తవ్యం 2: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం 3: సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని తెలిపారు. బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు, ఎపి, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్, మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం చేపడుతామని, ప్రస్తుతమున్న ఎనఐపిఇఆరఎస్ ఆధునీకరించడంతో పాటు దేశంలో రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు, దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, సెవిÖకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు, జౌళి రంగానికి కేంద్ర బ్జడెట్‌లో చేయూతనివ్వడంతో పాటు మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం చేపడుతామని నిర్మలా సీతారామన్ స్పష్టం
చేశారు. సెవిÖ కండక్టర్ మిషన్ 2.క్ష ప్రారంభిస్తామని, త్వరలో నేషనల్ ్గªబైర్ స్కీమ్ ప్రారంభం, టెక్స్‌టైల్ రంగం అభివద్ధికి కొత్త పథకం, దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం ఏర్పాటు చేస్తామని, అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం ఉంటుందని, 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూతనిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఎసఎంఇ రంగానికి రూ.10 వేల కోట్లు ఇస్తామని, మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తామని, ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు అని, రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పాట్నా, వారణాసిల్లో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అభివద్ధితో పాటు ముంబై` పుణెళి, పుణెళి`హైదరాబాద్, హైదరాబాద్` చెన్నై రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించడంతో పాటు ఢిల్లీ` వారణాసి, వారణాసి` సిలిగురి మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దష్టిలో పెట్టుకుని దేశంలో ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచి సుస్థితర ఆర్థికాభివద్ధి సాధించడం. మొదటి కర్తవ్యంలో భాగంగా ఈ ఆరు రంగాల్లో సుస్థిర అభివద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఏడు వ్యూహాత్మక, నిర్దేశిత రంగాల్లో ఉత్పాదతక ను వేగవంతం చేయడం, పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపజేయడం వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్ థీమ్‌గా బడ్జెట్ ఉందన్నారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉపాధి, వద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు. 2025లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు.కొన్ని వస్తువులకు పన్నుల మినహాయింపులు, తగ్గింపును ప్రకటించారు. దీంతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం మరింత పెరగనున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు బలమైన ఊతం. దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్థిరత్వం వంటివి ప్రతిపాదించారు. టెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, పరిశ్రమలకు విద్యాసంస్థల అనుసంధానం
మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు. 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం. టెక్స్‌టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు. జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన. రెడో కర్తవ్యం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించి సుసంపన్న భారత్ దిశగా అడుగులు వేసేలా భాగం చేయడం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడినట్లు తెలిపారు. గత పదేళ్ల కాలంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం, సంస్కరణల కారణంగా సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. పైవేటు రంగ భాగస్వామ్యంతో మెడికల్ టూరిజం సర్వీసులు. ఐదు రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు. ఆయుష్ కేంద్రాల అప్‌గ్రెడేషన్, సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు. పైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత. నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు. ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడాభివద్ధి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ విజన్‌తో దేశంలోని ప్రతి కుటుంబం, వర్గం, మతం, రంగానికి వనరులు, సదుపాయాలు, అవకాశాలను అందిస్తూ అభివద్ధిలో అర్థవంతమైన భాగస్వాములుగా చేయడం. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం.
దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన. మానసిక వ్యాధుల చికిత్సకు రాంచీ, తేజ్‌పుర్‌లలో నేషనల్ మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ అప్‌గ్రెడేషన్. భారత్ విస్తార్ (వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సిస్ అగ్రికల్చర్ రిసోర్స్) వ్యవసాయ రంగానికి కత్రిమ మేధను అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి పెంపు, మదింపు చేసి, రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకునేలా ప్రోత్సహించడం
తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్టాల పర్యాటక ప్రాంతాల అభివద్ధి, ఇందు కోసం 4వేల ఇ`బస్‌ల అందించటం. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్టాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివద్ధి.మొదటి రెండు కర్తవ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే, మూడో కర్తవ్యం ద్వారా 2047 నాటికి సమగ్రాభివద్ధితో వికసిత్ భారత్‌గా మారడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
బడ్జెట్‌లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. జాబితాలో హైదరాబాద్
రైల్వేకు సంబంధించి వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఏడు నగరాలకు హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌ను కలుపుతూ హైదరాబాద్` బెంగళూరు, పుణె`హైదరాబాద్, హైదరాబాద్`చెన్నై కారిడార్లు ఉన్నాయి. ఏడు కారిడార్లు ఇవీ..
ముంబయి`పుణె
పుణె`హైదరాబాద్
హైదరాబాద్`బెంగళూరు
హైదరాబాద్`చెన్నై
దిల్లీ`వారణాసి
వారణాసి`సిలిగుడి
చెన్నై`బెంగళూరు
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి స్వల్పంగా పెంచారు. దేశ మౌలికసదుపాయాల కల్పన గురించి మాట్లాడుతూ.. ఈ కారిడార్ల గురించి సీతారామన్ వెల్లడించారు. వీటిద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇవి ప్రయాణ సమాయాన్ని కుదిస్తాయని, రోడ్డు మార్గం, ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు.
అరుదైన ఖనిజ వనరులున్న రాష్టాలకు ప్రత్యేక ప్రోత్సాహం
ఖనిజ వనరులున్న రాష్టాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్టాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్టాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దీర్ఘకాలిక ఆర్థిక వద్ధికి సజనాత్మకత జోడింపు
ఆరెంజ్ ఎకానవిÖ’ లక్ష్యంగా ఆయా రంగాల్లో సజనాత్మకతను ప్రోత్సహించి, భవిష్యత్తులో సష్టించే ఉపాధి అవకాశాలకు సరిపడే నైపుణ్యాలతో సిద్ధంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విÖడియా, వినోదం, మేధోసంపత్తి వంటి క్రియేటివ్ రంగాలను సూచించే పదమే ఆరెంజ్ ఎకానవిÖ. భౌతిక ఉత్పత్తుల కన్నా ప్రధానంగా సజనాత్మకత, ఆలోచనలు, సాంస్కతిక సంపద నుంచి వచ్చే విలువను ఇలా పేర్కొంటారు. యానిమేషన్, వీఎఫఎక్స్, గేమింగ్, కామిక్స్, డిజైన్, టూరిజం, వినోదం వంటి రంగాలు ఇందులోకి వస్తాయి.యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగం వేగంగా అభివద్ధి చెందుతోందని, 2030 నాటికి 20లక్షల మంది నిపుణులు అవసరమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేర డిమాండ్‌ను అందుకునేందుకు వీలుగా.. ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ నేతత్వంలో దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని తాజా బ్జడెట్‌లో ప్రతిపాదించింది. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, డిజిటల్, సజనాత్మక రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం, కొత్తతరం సష్టికర్తలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటితోపాటు తూర్పు భారతంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశంలో డిజైన్ రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. శిక్షణ పొందిన డిజైనర్ల కొరత ఉందన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వద్ధికి సజనాత్మక ఆధారిత రంగాలే చోదకాలని ఆర్థిక సర్వే పేర్కొంది. ఉపాధి కల్పన, పట్టణ సేవలు, పర్యటక రంగాలకు కీలకమని చెప్పింది. ఈ రంగాలకు అపారమైన వద్ధి సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పరిమిత కేంద్రాలు, నైపుణ్యాల్లో అంతరాలు, నియంత్రణ అడ్డంకులు వంటి సవాళ్లు ఉన్నాయని, ఇందుకోసం విధానపరమైన మద్దతు అవసరమని సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు చేసింది.సజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి అని.. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం సజనాత్మక రంగాలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసింది.
విదేశీ విద్యకు వెళ్లే వారికి ఊరట
విదేశీ విద్యా నిధుల ప్రవాహం తగ్గుముఖం పడుతున్న తరుణంలో కేంద్ర బడ్జెలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేశారు. విదేశాల్లో చదువుకోవాలనే భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట కల్పించే ప్రకటన చేశారు. సరళీకత చెల్లింపు పథకం కింద విదేశాలకు పంపే విద్యా నిధులపై టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ విద్యతో పాటు వైద్య అవసరాల కోసం పంపే నిధులపై గతంలో 5శాతం టీసీఎస్ ఉండగా.. దాన్ని 2శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. తాజా ప్రతిపాదనతో రూ.10లక్షల కన్నా ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పంపేవారికి ప్రయోజనం చేకూరనుంది. తాజా ప్రతిపాదనలతో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఇకపై తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై తక్షణ నగదు భారం తగ్గుతుంది. జర్మనీ వంటి దేశాలకు వెళ్లే వారికి దీనివల్ల ఎక్కువ ప్రయోజనమని చెప్పొచ్చు. ఎందుకంటే.. జర్మనీలో విద్యకోసం వెళ్లే విద్యార్థులు అక్కడి ’బ్లాక్డ్ అకౌంట’లో దాదాపు ?12 లక్షలకు పైగా జమ చేయాల్సి ఉంటుంది. గతంలో 5? ªTఅªS ఉండేది, ఇప్ప్పుడు అది 2శాతానికి తగ్గించడంతో విద్యార్థులకు కొన్ని వేల రూపాయల మేర ఆదా కానుంది. టీసీఎస్ అనేది అదనపు పన్ను కాదు. దీన్ని ఐటీ రిటర్నుల ద్వారా తిరిగి పొందొచ్చు. వికసిత భారత్‌కు సేవల రంగాన్ని కీలక చోదక శక్తిగా మార్చడంపై దష్టిసారించే చర్యలను ఈ బ్జడెట్‌లో నిర్మలమ్మ సిఫారసు చేశారు. ఇందుకోసం ఉన్నతస్థాయి ’ఎడ్యుకేషన్ టు ఎంఎª`లాయిమెంట్ అండ్ ఎంటర్పైజ’ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనివల్ల 2047 నాటికి ప్రపంచ సేవల రంగంలో 10శాతం వాటాతో దేశం అగ్రగామిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. వద్ధి, ఉపాధి, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై ఏఐ సహా అభివద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావాలను అంచనా వేసి తదనుగుణంగా చర్యలను ప్రతిపాదించనుంది. ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల సవిÖపంలో ఐదు విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు బ్జడెట్‌లో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు రాష్టాల్లో ఏర్పాటుచేసే ఈ అకెడమిక్ జోన్లలో పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, నివాస సముదాయాలు ఉండేలా ప్రణాళికలు రచించనున్నారు. దేశంలో డిజైనింగ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డిజైనర్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు భారతదేశంలో డిజైనింగ్ విద్య, అభివద్ధిని ప్రోత్సహించేందుకు ఒక నూతన నేషనల్ డిజైనఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించేందుకు ప్రతిపాదన చేశారు. ఉన్నత విద్యకు సంబంధించి న్‌స్టిట్యూట్‌లలో గంటల తరబడి విద్యార్థినులు చదువుకోవడం, ప్రయోగ శాలల్లో ఉండటం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల కోసం వీజీఎఫ్/మూలధన సహకారం ద్వారా ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గహం ఏర్పాటు చేయాలని బ్జడెట్‌లో ప్రతిపాదించారు. ఆస్టోఫ్రిజిక్స్, ఖగోళ శాస్తాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 4 టెలిస్కోప్ మౌలిక సదుపాయాల సంస్థలను ఏర్పాటు లేదా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీటిలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్`2 ఎª`లానిటోరియం ఉన్నాయి.
మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుదల
140కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం
బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధాని మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ(జనంసాక్షి):కేంద్ర బడ్జెట్ 2026`27 పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. మూలధన వ్యయానికి, వద్ధికి మధ్య సమతూకం పాటించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశనర చేస్తుందని, ఇది చరిత్రాత్మక బ్జడెట్ అని కొనియాడారు. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ భారత్‌కు కేటాయింపులు చేశారు. 2047 మిషన్ లక్ష్యాల అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది‘ అని చెప్పారు. ప్రభుత్వ సంస్కరణల అజెండాను రీఫామ్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచిన మోదీ ఆ ఎక్స్‌ప్రెస్‌కు బ్జడెట్ కొత్త శక్తిని అందించిందని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయన్నారు. భారతదేశం వేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోవాలని భారతీయులు అనుకోవడం లేదని, సాధ్యమైనంత వేగంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఈ పద్దు మహిళా సాధికారతకు నిదర్శనంగా ఉందని, వరుసగా తొమ్మిదిసార్లు దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టి నిర్మలాసీతారామన్ రికార్డు సష్టించారని ప్రధాని మోదీ కొనియాడారు.
రాష్టాలను విస్మరించిన కేంద్ర బడ్జెట్: ఎంపి శశిథరూర్
గత కొన్నేళ్లుగా చేస్తున్న బడ్జెట్ ప్రసంగాలలో ఇది చాలా చిన్నదిగా అనిపిస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోలేదు. రాష్టాలకు నిధులు కేటాయించలేదు. అసలు భవిష్యత్తులో కేంద్రం ఏమి చేయబోతోంది అనే విషయాలపై ఎటువంటి వివరాలు లేవు. కేరళలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దానిపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్థాపించనున్నట్లు మంత్రి చెప్పారు. కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఈ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని `కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. ఎంపీ శశిథరూర్ పెదవి విరిచారు. ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతప్తి కలిగించలేదని అన్నారు. బడ్జెట్‌లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఆయుర్వేదం, మత్స్యకారులు, కొబ్బరితోటలు, షిప్ మరమ్మతులకు సంబంధించి బ్జడెట్‌లో ఎలాంటి ప్రస్తావనలు లేవన్నారు. కేరళకు సుదీర్ఘమైన ఆయుర్వేద చరిత్ర ఉందని, ఆయుర్వేద ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ కోసం తామంతా ఎదురుచూస్తున్నామని, కానీ ఆ ప్రస్తావనే బ్జడెట్‌లో లేకుండా పోయిందని శశిథరూర్ విమర్శించారు. కనీసం మత్స్యకారులు, కొబ్బరితోటల సంబంధించి ఏదైనా ప్రకటన ఉండొచ్చని ఆశించామని, అది కూడా లేదని అన్నారు. నౌకాశ్రయాల మరమ్మతుల ప్రస్తావన వచ్చినప్ప్పుడు వారణాసి, పాట్నా పేర్లు చెప్పారే కానీ కేరళ ఊసే లేకపోవడం ఆశ్చర్య కలిగించిందని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన అనేది మరోసారి జవాబులేని ప్రశ్నగా మిగిలిందని శశిథరూర్ అన్నారు. బ్జడెట్ ప్రసంగంలో దీనిపై మాట్లాడింది కూడా ఏవిÖ లేదన్నారు. గత కొన్నేళ్లుగా చేస్తున్న బ్జడెట్ ప్రసంగాలలో ఇది చాలా చిన్నదని చెప్పారు. మధ్యతరగతి, దిగువ తరగతి వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం కానీ, కనీసం ఏం చేయబోతున్నారనే వివరాలు కూడా చేటుచేసుకోలేదని అన్నారు.
’దేశ సంక్షోభంపై మోదీ సర్కార్ గుడ్డిగా వ్యవహరిస్తోంది’
` యువతకు ఉద్యోగాలు లేవు, పొదుపు ఆవిరైపోతోంది
` అసమానతలు బ్రిటిష్ కాలం నాటికంటే దారుణం
` కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ(జనంసాక్షి):కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026`27 వార్షిక బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. “ఇదొక గుడ్డి బడ్జెట్. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాలు దీనికి కనిపించడం లేదు” అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి ఆలోచనలు అడుగంటాయని, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్లకు ఇందులో ఒక్కటంటే ఒక్క పరిష్కారం కూడా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ ‘ఎక్స’ వేదికగా బడ్జెట్?పై స్పందించారు. దేశంలోని దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఆరు కీలక అంశాలను ప్రస్తావించారు. “దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుప్పకూలుతోంది. పెట్టుబడిదారులు భయపడి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. సామాన్యుడి ఇంట్లో పొదుపు ఆవిరైపోతోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఆర్థిక ముప్పులను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. దేశం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, బడ్జెట్ ద్వారా దాన్ని సరిదిద్దాలి. కానీ ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. వాస్తవాలను చూడటానికి ఇష్టపడటం లేదు. సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకునే చర్యలు ఇందులో శూన్యం” అని రాహుల్ విమర్శించారు.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..
` సీఎంతో సహా మంత్రులంతా ప్రధానిని, కేంద్రమంత్రులను పలుమార్లు కలిసినా ప్రయోజనం లేదు
` జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు
` ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం గురించి పట్టించుకోలేదు
` ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్టానికి కేటాయింపులు లేకపోవడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు బందాలుగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లను పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశపరిచిందని పేర్కొన్నారు. ఆదివారం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన విÖడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.మూసి పునర్జీవం, రీజినల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర అభివద్ధి మెట్రో రైల్ విస్తరణ ఇతర మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆశించామన్నారు. బయో ఫార్మా అంటే ముందుగా కేంద్రానికి గుర్తు రావాల్సింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ప్రకటించిన బయో ఫార్మా లో తెలంగాణకు నిధులను పొందుపరచకపోవడం తీవ్ర నిరాశపరిచింది కేంద్ర బడ్జెట్లో ఎలక్టానిక్స్ కు రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేశారు ఇందులో కూడా తెలంగాణకు ఒక పైసా ఇవ్వకపోవడం అన్యాయం. హైదరాబాదులో ఎలక్టానిక్ ఎకో సిస్టం విస్తారంగా అభివద్ధి చెందింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈసీఐ లాంటి సంస్థలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్టానిక్స్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఎలక్టానిక్స్ అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాష్టానికి ఈ విభాగంలో కూడా నిధులు ఇవ్వకపోవడం అన్యాయం. ఫార్మ హబ్ గా ప్రపంచానికి హైదరాబాదు గుర్తింపు కోవిడ్ సమయంలో ఈ దేశానికే కాకుండా ప్రపంచాన్ని కూడా భారత్ బయోటెక్ ఔషధాలను అందించింది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవిడ్ సమయంలో సందర్శించారు. కానీ ఫార్మ హబ్ లో కూడా తెలంగాణను పేర్కొనలేదు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగం పైన ఫోకస్ పెట్టింది గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ సందర్భంగా కూడా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడితో క్రీడలు నిర్వహించాం. క్రీడారంగం పైన ప్రత్యేక దష్టి సారించి ముందుకెళ్తున్న క్రమంలో తెలంగాణ కేంద్రానికి ఎందుకు గుర్తుకు రాలేదు. ఆరెంజ్ ఎకానమిలో హైదరాబాద్ సెంట్రిక్ ముంబైకి తరలించారు. తెలంగాణ ఏమి తప్పు చేసింది. ఆడియో వీడియో గేమింగ్ కామెక్స్ లాంటి వాటికి హైదరాబాద్ నగరం బిగ్గెస్ట్ సెంటర్. ఆరెంజ్ ఎకానవిÖలో హైదరాబాద్ పై దష్టి పెట్టకుండా ముంబైలో పెట్టడం ఏంటిహైదరాబాద్ మెడికల్ హబ్ గా అభివద్ధి చెందుతున్నది దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాదులో అందుబాటులో ఉన్న మెడికల్ ఫెసిలిటీని ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. రీజినల్ మెడికల్ వ్యాల్యూ హబ్ లో ఇతర రాష్టాలకు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. టూరిజం విభాగంలో కూడా తెలంగాణ రాష్టాన్ని పొందుపరచకపోవడం అన్యాయం యునెస్కో గుర్తించిన రామప్ప లాంటి హెరిటేజ్ దేవాలయం మన్ననూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ కష్ణ గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలు అటవీ ఇటీవల జరిగిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు న్యూజిలాండ్ దేశస్తులు వచ్చి దర్శించుకున్నారు ఇంత గొప్పగా ఉన్న తెలంగాణ టూరిజంను ప్యాకేజీలో పేర్కొనలేదు. రేర్ ఎర్త్ మినరల్స్ లో కూడా తెలంగాణ పై కేంద్రం దష్టి సారించలేదు. ఇప్పటికే సింగరేణి సంస్థ సత్తుపల్లి రామగుండం లో స్కాండియం, లిథియంను వెలికితీయడానికి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెస్ ను నడుపుతున్నది. తెలంగాణ రాష్టానికి సెవిÖ కండక్టర్ మంజూరు చేయాలని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసినప్పటికీ బడ్జెట్లో మిగతా రాష్టాలకు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమంపై ఈ బడ్జెట్ లో దష్టి సారించలేదు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిÖ పథకానికి తూట్లు పొడిచే పని చేస్తున్నారు దీనివల్ల గ్రావిÖణ ప్రాంత పేదలకు తీవ్ర నష్టం జరగనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వికసిత్ భారత్ గోలుకు కాంట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి త్రీ మిలియన్ డాలర్ ఎకానవిÖగా రాష్టాన్ని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యం చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్ర అభివద్ధి బలమైన పునాదులకు ప్రోత్సాహం అందించి ముందుకెళ్లాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందితెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని రాజకీయాల కతీతంగా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్ సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఫిజికల్ డెఫిషిట్ లో రాష్టానికి నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ కేంద్రం మాత్రం 4.3 శాతం ఫిజికల్ డెఫిషిట్ పెట్టుకుంది తెలంగాణకు మాత్రం అనుమతి ఇవ్వలేదు తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? ప్రజల జీవన ప్రమాణాలు ఆర్థిక గతులు పెంచడానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించే వీలుగా బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను కక్ష్య సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడదు అత్యంత ప్రజాస్వామ్యతమైన పరిపాలన అందించడమే మా ప్రజా ప్రభుత్వం ధ్యేయం.



