వికారాబాద్ వీరశైవ లింగాయత్ యువదళ్ ఆధ్వర్యంలో

 పచ్చడ వితరణ మల్లికార్జున భవనంలో పంచాంగ శ్రవణం
వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 23 వికారాబాద్ వీరశైవ లింగాయత్ యువదళ్ మరియు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడ వితరణ కార్యక్రమాన్ని ముందుగా బసవేశ్వరునికి అభిషేకం చేసి తర్వాత పూలమాల వేసి మంగళ హారతితో పచ్చడ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోవద్దు అని యువకులు అందరూ కలిసి మన ఆచార సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఉగాది పచ్చడలో ఉన్న షట్రుష్లను తీపి వగరు చేదు ఉప్పు కారం పులుపు ఇలాంటి ఆరు రుచులను కలిపి సంవత్సరం ఆరంభంలో నూతనంగా చిగురిస్తున్న చెట్లను వాటి ద్వారా వచ్చే పుష్పాలను ఎలా స్వీకరిస్తామో అలా ఆరంభంలో కష్టసుఖాలను ఎదిరించే ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకున్నారూ తద్వారా సేవ చేసిన ప్రతి ఒక్కరినీ సమాజం గుర్తిస్తుంది అన్నారు ఈ విధంగా గుర్తించిన వారిలో మరాఠీ ప్రభు లింగం ఒకరు ఉగాది పర్వదినం సందర్భంగా వారికి సమాజం పెద్దల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ముద్ద దీప భక్తవసలం, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శ్రీబసవసంగమేశ్వరభక్తిటీవీ చైర్మన్ యాలాల కోటిలింగం, వీరశైవసమాజం పెద్దలు చెక్క వీరన్న ,ఆత్మలింగం, కౌకుంట్ల వీరేశం, వీరసేవ సమాజం అధ్యక్షులు అప్ప విజయ్ కుమార్, యువదళ్ అధ్యక్షులు గుండుమల్ల కిషోర్ ,ఉప్పు అమర్నాథ్, భానుచందర్, సంతోష్ ,అమర్నాథ్, కాశెట్టి శివానంద్, సుధీర్ పటేల్, జగదీష్ ,కార్తీక్ ,గంగిశెట్టి, యువ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు