‘వికార్ది నకిలీ ఎన్కౌంటర్లా ఉంది’

'వికార్ది.. గుజరాత్ నకిలీ ఎన్కౌంటర్లా ఉంది'
 న్యూఢిల్లీ: వికారుద్దీన్ ఎన్కౌంటర్పై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ గతంలో గుజరాత్లో చోటు చేసుకున్న నకిలీ ఎన్కౌంటర్ను పోలి ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. విచారణ జరిపితే కానీ నిజానిజాలు వెలుగులోకి రావని ఆయన అన్నారు.

వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని టంగుటూరు శివారులో జాతీయ రహదారిపైనే మంగళవారం కాల్పు లు జరిగాయి. ఇందులో వికార్ అహ్మద్(29) అలియాస్ వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అమ్జద్(23), ఇజార్ ఖాన్(29), మహమ్మద్ జకీర్(32), మహమ్మద్ హనీఫ్(34) మృతి చెందా రు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న వీరిని కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్పై విచారణ జరపాలని ఇప్పటికే వికారుద్దీన్ తండ్రి మహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.