విగ్రహం దాతలు ఇచ్చారు.. కొంగలను కొనుక్కొచ్చారు..
అధికారుల మౌనం ప్రజాధనం మాయం.
అంచనాలు 25 లక్షలు.. 50 లక్షల కు పెంచాలన్న ప్రతిపాదనలు.
సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది.
సిరిసిల్ల. నవంబర్ 2 (జనం సాక్షి). విగ్రహాన్ని దాతలే అందించారు. కొంగలను మాత్రం మున్సిపాలిటీ నుంచి కొనుగోలు చేశారు. లక్షల్లో ఖర్చు అవుతున్నట్లు లెక్కలు రాసేశారు. 25 లక్షలతో మరమ్మతులు చేసినట్లు అంచనాలను రూపొందించారు. ప్రతిపాదనలకు వచ్చేసరికి సరిపోవని అనుకున్నారో ఏమో 50 లక్షలకు పెంచేశారు. అడిగేవారు అడిగిన చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్న అధికారుల్లో చలనం లేకుండా పోయింది. అసలు ఈ “కొంగ”ల వ్యవహారం వెనుక మతుల బేంటో తెలుసుకోవాలంటే సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతుందన్న ప్రశ్న వేసుకోవాల్సిందే.
సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం నిధులకు కొదువలేదు. అడిగినన్ని నిధులు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వచ్చిన నిధులు ఖర్చు పెడుతున్నా విషయం పైనే సందేహాలు ముసురుకుంటున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పద్మశాలి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సిరిసిల్ల విద్యానగర్ బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని గతంలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని విరాళాలు సేకరించి కొనుగోలు చేశారు. విగ్రహం ప్రతిష్టాపన విషయంలో జాప్యం జరుగుతుండడం పై ఆగ్రహించిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు అసహన వ్యక్తం చేస్తున్న క్రమంలో అధికార పార్టీ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పరంగానే కొండ లక్ష్యన్ బాపూజీ విగ్రహాన్ని బైపాస్ లో ప్రతిష్టించేందుకు మున్సిపల్ పాలకవర్గం తీర్మానించింది. పనులు చక చక జరిగిపోయాయి. విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. చిక్కంత విగ్రహ ప్రతిష్టాపన కోసం వేసిన అంచనాలు ప్రతిపాదనలు కాడే వచ్చి పడింది. ఈ అంశమే ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో దుమారం రేపింది. అప్పటికే బైపాస్ వద్ద వాటర్ ఫౌంటెన్ నిర్మాణమై ఉంది. అదే స్థలంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. 30.07.22 తేదీ సోమవారం జరిగిన సమావేశంలో 25 లక్షలతో రీ డిజైన్ కోసం ప్రతిపాదనలు చేసి ఆమోదించారు. అధునాతన పద్ధతుల్లో మళ్లీ అదనంగా మరో 25 లక్షలు అంటే మొత్తం 50 లక్షలతో పనులు చేసేందుకు అక్టోబర్ 31న జరిగిన సమావేశంలో ప్రతిపాదనలు చేయగా సభ్యులు ఎవరు ఆమోదం తెలుపకపోవడం గమనార్హం. విగ్రహం దాతలే ఇచ్చారు. ఫౌంటెన్ స్థలంలో కొన్ని మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు అదనంగా రెండు కొంగ బొమ్మలు మాత్రం వచ్చాయి దీనికి ఎన్ని లక్షలు ఎలా ఖర్చు అవుతాయి అన్న సామాన్య ప్రజల ప్రశ్నకు మాత్రం జవాబు దొరకడం కష్టమే. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ను వివరణ కోరితే ఇంకా ఆమోదం తెలుపు లేదంటూ దాట వేశారు. ముందుగానే మున్సిపల్ అధికారులు 25 లక్షల అంచనా తో రూపొందించిన ప్రతిపాదనలపై కూడా స్పందించలేదు.సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాకలలో జరుగుతున్న ఈ వ్యవహారంపై కనీసం కొంగ బొమ్మలకు మాటలు వచ్చిన నిజాలు చెప్పేవేమో. ప్రజా ప్రతినిధుల మౌనం అధికారుల వృదాశినత వేరసి లక్షల్లో ప్రజాధనం పక్కదారి పడుతుందన్నది నిస్సందేహం.