విజన్ 2022 బడ్జెట్..ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఆర్థికమంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్ భారత అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్జడెట్‌కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. గృహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై 2022 నాటికి లక్ష్యాల్ని ఏర్పాటు చేసి వాటిని చేరుకునేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. పన్ను విధానం స్పష్టంగా పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఉందని తెలిపారు. యువత, రైతులు, మధ్యతరగతి, పేదల అభ్యున్నతికి బ్జడెట్లో సమ ప్రాధాన్యమిచ్చారన్నారు. బ్జడెట్లో అన్ని రాష్టాల్రకు సమ ప్రాధాన్యం కల్పించారన్నారు. నల్లధనంపై బ్జడెట్లో ప్రవేశ పెట్టిన అంశాలు తమ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టేవిగా ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రకటించిన కొత్త పథకాలు దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేలా రూపొందించాలరని హర్షం వ్యక్తం చేశారు. మంచి బ్జడెట్‌ను రూపొందించడంతో అరుణ్ జైట్లీ కృతకృత్యులయ్యారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి సంతోషం కలిగించే విధంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి ఒక ప్రతిపాదన చేశారు. భారత దేశానికి ప్రత్యేకత కలిగిన యోగా సంస్థలకు చారిటబుల్ ట్రస్టుల కింద పన్ను మినహాయించినట్లు జైట్లి తెలిపారు.జైట్లి ఈ ప్రకటన చేసినప్పుడు మోడీ బల్ల చరుస్తూ తన సంతోషం తెలిపారు.కాగా వ్యక్తిగత పన్ను దారులకు సుమారు నాలుగున్నర లక్షల అరవై వేల రూపాయల వరకు పన్ను లేకుండా చేస్తున్నట్లు ,వివిధ రాయితీలను పరిగణనలోకీ తీసుకున్న తర్వాత ఈ లెక్క చెప్పారు.